నేషనల్‌ హైవే–63 బాధిత రైతుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

నేషనల్‌ హైవే–63 బాధిత రైతుల ఆందోళన

Sep 8 2026 12:41 AM | Updated on Sep 8 2026 12:41 AM

పాతమంచిర్యాల: నేషనల్‌ హైవే–63 బాధిత రైతులు సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రహదారి నిర్మాణంపై కేసు కోర్టు విచారణలో ఉండగానే రైతులకు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నోటీస్‌ ప్రతులను దహనం చేసి ఆర్డీఓ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. బాధిత రైతులు, బీజేపీ సీనియర్‌ నాయకుడు తులా మధుసూదన్‌ మాట్లాడుతూ 2023లో నేషనల్‌ హైవే అధికారులు పాత రోడ్డు ప్రకారంగా రాయపట్నం నుంచి మంచిర్యాల వరకు అలైన్‌మెంట్‌ ఇచ్చి గెజిట్‌ పాస్‌ చేశారని తెలిపారు. రాష్ట్ర మంత్రి వివేక్‌ రోడ్డుపై కుట్రలు చేసి బ్రౌన్‌ఫీల్డ్‌ అలైన్‌మెంట్‌ను గ్రీన్‌ఫీల్డ్‌ అలైన్‌మెంట్‌గా మార్పించారని విమర్శించారు. హాజీపూర్‌, లక్షెటిపేట మండలాల రైతుల కుటుంబాలు బజారున పడనున్నాయని తెలిపారు. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే అలైన్‌మెంట్‌ను బ్రౌన్‌ఫీల్డ్‌ హైవే అలైన్‌మెంట్‌గా మార్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మున్నారాజా సిసోడియా, కాసెట్టి నాగేశ్వర్‌రావు, బోయిని హరికృష్ణ, మేడిపల్లి సత్యం, లగిశెట్టి రాజమౌళి, ఉస్మాన్‌పాషా, ఎన్‌హెచ్‌–63 బాధిత రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement