జైపూర్ మండలం పౌనూర్ శివారులో సర్వే నంబరు 172/1లోని ఐదు ఏకరాల భూమి 1978–79 నుంచి 2000–01 సంవత్సరం వరకు మా నాన్న పేరిట పట్టా ఉంది. మా అన్న పేరిట సర్వే నంబరు 172లో రెండున్నర ఎకరాల పట్టా భూమి ఉంది. ఈ భూమిని 22ఏ యాక్టు కింద నిషేధిత జాబితాలో నమోదు చేశారు. ఈ జాబితా నుంచి తొలగించాలి.
– జాడి సీతయ్య, పౌనూర్, జైపూర్
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్
ఇవ్వడం లేదు
నా అల్లుడు సంతోష్ 2021లో చనిపోయాడు. అప్పటికే నా కూతురికి బాబు ఉన్నాడు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం లక్సెట్టిపేట తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించి గత జూలై 16న మీసేవలో దరఖాస్తు చేశాం. 45రోజలు గడిచినా ఇవ్వడం లేదు. మహారాష్ట్రలో చనిపోయాడని, అక్కడే ఇస్తారని చెబుతున్నారు. నా కూతురికి వితంతు పింఛన్, మనవడికి మిషన్ వాత్సల్య కింద రూ.4వేలు అన్నీ ఇక్కడే వస్తున్నాయి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీకి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
– మేడారం అంజయ్య, గోదావరిరోడ్,
లక్సెట్టిపేట


