సోమగూడంను ముంపు గ్రామంగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

సోమగూడంను ముంపు గ్రామంగా ప్రకటించాలి

Sep 8 2026 12:41 AM | Updated on Sep 8 2026 12:41 AM

కాసిపేట: కేకే ఓపెన్‌కాస్ట్‌ గని బ్లాస్టింగ్‌తో గత కొన్నేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పూర్తి స్థాయి ముంపు గ్రామంగా ప్రకటించాలని సోమగూడం(కె) గ్రామస్తులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనులు అడ్డుకున్నారు. అధికారులు వారితో మాట్లాడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని, రెండ్రోజులు గడువు కావాలని కోరారు. దీంతో రెండ్రోజుల్లో గ్రామాన్ని సందర్శించి సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బ్లాస్టింగ్‌తో ఇళ్లు దెబ్బతినడం, గోడలు కూలిపోవడం, దుమ్ము, ధూళి సమస్యతో ప్రజల జీవనం దుర్భరంగా మారాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో లంబాడితండా(కె) సర్పంచ్‌ బలరాం, మాజీ సర్పంచ్‌ సపాటు శంకర్‌, ఉపసర్పంచ్‌ మల్యాల స్రవంతి, వార్డు సభ్యులు ప్రశాంత్‌, తిరుపతి, భుక్య పద్మ, రమేష్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement