సమాజ నిర్మాణంలో టీచర్ల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

సమాజ నిర్మాణంలో టీచర్ల పాత్ర కీలకం

Sep 7 2026 3:08 AM | Updated on Sep 7 2026 3:08 AM

● ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు

మంచిర్యాలఅర్బన్‌: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. ఆదివారం ఓ ప్రైవేట్‌ కన్వెన్షన్‌లో మంచిర్యాల ట్రస్మా ఆధ్వర్యంలో ఆచార్యదేవోభవ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన 140 మంది కరస్పాండెంట్లు, 140 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ సల్ల రమ్య, ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శేఖర్‌రావు, జిల్లా అధ్యక్షుడు విష్ణువర్థన్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదారి చంద్రమోహన్‌గౌడ్‌, కోశాధికారి శ్రీధన్‌, ఢిల్లీ డిఫెన్స్‌ ఆకాడమీ చైర్‌పర్సన్‌ సతీష్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు పద్మచరణ్‌, సిద్దయ్య, శరత్‌, సత్తయ్య, వేణు, ఉస్మాన్‌ పాషా, బాలాజీ, విక్రమ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

లక్సెట్టిపేట: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎస్‌పీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దండేపల్లి, లక్సెట్టిపేట మండలా ల్లోని 312 మంది లబ్ధిదారులకు సుమారు రూ.90 లక్షల చెక్కులు అందజేశామన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ, మున్సిపల్‌ చైర్మన్‌ దొంత అంజలి, వైస్‌ చైర్మన్‌ రాజేశ్వరి, ఏఎంసీ చైర్మన్‌ వెంకటేశ్వర్లు, నాయకులు గడ్డం త్రిమూర్తి, నలిమెల రాజు, రమేశ్‌, షాహిద్‌అ లీ, ఆరీఫ్‌, శ్రీనివాస్‌, నర్సయ్య, పూర్ణచందర్‌రావు, సురేష్‌ నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

మతాలకు అతీతంగా

ఉత్సవాలు జరుపుకోవాలి

మంచిర్యాల క్రైం: వినాయక నవరాత్రి ఉత్సవాలు మతాలకు అతీతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కన్వెన్షన్‌ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు అనుమతులకోసం ఈ నెల 10 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పరిశీలన తర్వాత అధికారులు నిర్ధేశించిన స్థలంలోనే విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నవరాత్రుల్లో మద్యం అమ్మకాలపై ఎక్సెజ్‌ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఏసీపీ ప్రకాష్‌ మాట్లాడుతూ మండపాల వద్ద కనీసం రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే హెల్ప్‌లైన్‌ 112కు సమాచారం అందించాలన్నారు. సమావేశంలో మేయర్‌ ధర్ని మధుకర్‌, డిప్యూటీ మేయర్‌ సల్ల రమ్య, కమిషనర్‌ అన్వేష్‌, సీఐలు ప్రమోద్‌రావు, రమణమూర్తి, రవీందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement