దండేపల్లి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దండేపల్లి మండల పర్యటనలో ఫ్లెక్సీలు చించివేయడం, ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్న ఘటనపై టీపీసీసీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆదివారం కాంగ్రెస్ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 10 రోజుల్లో లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని కోరారు. జూలై 18న ఎంపీ వంశీకృష్ణ దండేపల్లి మండలం గూడెం ప్రభు త్వ పాఠశాలలో విశాఖ చారిటబుల్ ట్రస్టు ఆ ధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసేందుకు వచ్చారు. ఎంపీ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీలను, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అనుచరులు చించివేయడంతో పాటు, ఎంపీ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. నోటీసులు అందుకున్న వారిలో గడ్డం త్రిమూర్తి, అక్కల వెంకటేశ్వర్లు, అంకతి శ్రీనివాస్, ముత్యాల శ్రీనివాస్, లక్కాకుల సృజన్, ఆకుల దుర్గాప్రసాద్ ఉన్నారు.


