పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు | - | Sakshi
Sakshi News home page

పదేళ్ల పాలనలో చేసిందేమీ లేదు

Sep 6 2026 1:31 AM | Updated on Sep 6 2026 1:31 AM

● రాష్ట్ర మంత్రి వివేక్‌ వెంకటస్వామి

జైపూర్‌: పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ ప్రజలకు చేసిందేమీ లేదని మంత్రి గడ్డం వివేక్‌ వెంకట స్వామి విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన సందర్భంగా శనివారం డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డితో కలిసి మండలంలోని ఇందారం నుంచి జైపూర్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశామన్నారు.

జోడు నాగులకు ప్రత్యేక పూజలు

ఇందారంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఇటీవల నూతనంగా ప్రతిష్టించిన జోడు నాగుల విగ్రహాలకు మంత్రి వివేక్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రిని సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement