● మేయర్ ధర్ని మధుకర్
నస్పూర్: దేశ భవిష్యత్‌ను నిర్మించేది ఉపాధ్యాయులేనని నగర మేయర్ ధర్ని మధుకర్ అన్నారు. శనివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ట్రస్మా ఆధ్వర్యంలో సీసీసీలోని ఎంఎం గార్డెన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యను అందించడ మే కాకుండా వారు ఉన్నత శిఖరాలు అధిరో హించేలా చూస్తారన్నారు. ఇంజనీర్, డాక్టర్‌లు గా తయారు చేస్తారన్నారు. మెడిలైఫ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల సంక్షేమాన్ని కోరుతూ వైద్య చికిత్సలో రాయితీ కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణి, జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీ జ్, జిల్లా గౌరవ అధ్యక్షుడు బత్తిని దేవన్న, మండల అధ్యక్షుడు మైదం రామకృష్ణ, కార్పొరేటర్ కోండ్ర రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.


