ప్రత్యేక ప్రచారంపై అవగాహన ఏది? | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక ప్రచారంపై అవగాహన ఏది?

Sep 6 2026 1:31 AM | Updated on Sep 6 2026 1:31 AM

● సర్‌పై ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో ప్రచారం ● అవగాహన లేక శనివారం అంతంత మాత్రంగానే కార్యక్రమం

మంచిర్యాలటౌన్‌: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బీఎల్‌వోలు అందుబాటులో ఉండాలి. కానీ దీనిపై ఎలాంటి ప్రచారం కల్పించక పోవడంతో మొదటిరోజు శనివారం అంతంత మాత్రంగానే కార్యక్రమాన్ని కొనసాగించారు. సర్‌లో నమోదు చేసుకున్న ఓ టర్లకు వివిధ కారణాలతో నోటీసులు జారీ కావడం, వాటికి సరైన ధృవీకరణ పత్రాలను జోడించి, తిరిగి బీఎల్‌వోలకు అందించే కార్యక్రమం సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన నాలుగురోజుల కార్యక్రమం తూతూ మంత్రంగానే సాగనుంది. రెండుదశల్లో చేపట్టే ఈ కార్యక్రమాల్లో మొదటి దశలో ఒకరోజు వృధా అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement