మంచిర్యాలఅర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విద్యాపరిపాలనలో విశిష్ట ప్రతిభా పురస్కారం–2026 అందుకున్నారు. శనివారం కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్స వ వేడుకల్లో ప్రదానం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక సంఖ్యలో విద్యార్థుల నమో దు పెంచడంలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపినందుకు అవార్డు ఫర్ ఎక్స్‌లెన్సీ ఇన్ ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్ అందజేశారు.
అవార్డు అందుకున్న రాజన్న
జన్నారం: మండలంలోని కిష్టాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండ రాజన్న ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. కొడంగల్‌లో నిర్వహించిన అవా ర్డుల ప్రదానోత్సవాల్లో ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితారాణా అవార్డు అందజేశారు. రాష్ట్రస్థా యి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని, మరింత ఉత్సాహంతో పాఠశాల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని రాజన్న తెలిపారు.


