మంచిర్యాలటౌన్: జిల్లా మంత్రి వివేక్‌కు దమ్ముంటే విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, యూత్ డిక్లరేషన్, జాబ్ క్యాలెండర్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, విద్యార్థులతో కలిసి జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా నుంచి వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, నిరుద్యోగ భృతి, 18 ఏళ్లు నిండిన అమ్మాయిలకు స్కూటీలు ఇప్పించాలని, మెగా డీఎస్సీ వేయించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇంట్లో ఉండే ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు బెంజ్ కారు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, ప్రజాప్రతినిధులు, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.


