గంజాయి విక్రేత అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రేత అరెస్ట్‌

Sep 6 2026 1:31 AM | Updated on Sep 6 2026 1:31 AM

వాంకిడి: మహారాష్ట్రకు చెందిన గంజాయి విక్రేతను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వేణుగోపాల్‌ తెలిపారు. శనివారం పోలీ సుస్టేషన్‌ ఎస్సై మహేందర్‌తో కలిసి వివరా లు వెల్లడించారు. మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారని సమాచారంతో శనివారం పోలీసులు తనిఖీ చేపట్టారు. గోయెగాంలో ఇండియన్‌ దాబా సమీపంలో పోలీసులను చూసి మహారాష్ట్ర చంద్రపూర్‌ జిల్లా బల్లార్‌పూర్‌కు చెందిన అజిత్‌ భయ్యాలాల్‌ పారిపోయేందుకు యత్నించారు. వారు వెంబడించి అదుపులో తీసుకున్నారు. అతన్ని తనిఖీ చేయగా సుమారు రూ.60 వేలు విలువ గల 2.4 కిలోల ఎండు గంజాయి లభించింది. విచారణలో నిందితుడితో పాటు అతని కుమారుడు వికాస్‌ పూరి గత రెండేళ్ల నుంచి బల్లార్షాకు చెందిన షేర్‌ఖాన్‌, జావిద్‌, మాజిద్‌ నుంచి గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రతోపాటు వాంకిడి, ఆసిఫాబాద్‌, రెబ్బెన మండలాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement