రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారుల సత్తా | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి క్రికెట్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారుల సత్తా

Sep 5 2026 5:43 AM | Updated on Sep 5 2026 5:43 AM

మంచిర్యాలక్రైం: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అండర్‌–16 రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీల్లో మంచిర్యాల నుంచి పాల్గొన్న మాదవ త్రిశూల్‌, మహ్మద్‌ అద్నాన్‌ సత్తా చాటారు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రుషిరాజ్‌ టీమ్‌ టాస్‌ గెలిచి ముందుగా బౌలింగ్‌ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌ చేసిన హెచ్‌సీఏ డిస్ట్రిక్ట్‌–1 టీమ్‌ 160 పరుగులు చేయగా.. ఈ టీమ్‌ నుంచి ఆడిన త్రిశూల్‌, అద్నాన్‌ కీలమైన ఆటగాళ్లుగా సహకారం అందించారు. అద్నాన్‌ 33 బంతుల్లో 34 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో త్రిశూల్‌ ఆరు ఓవర్లలో నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. రుషిరాజ్‌ బ్యాటింగ్‌లో త్రిశూల్‌ బౌలింగ్‌ లైనప్‌ను కుదిపేశాడు. మంచిర్యాలకు చెందిన ఈ కుర్రాళ్లు సత్తా చాటుకున్నారు. ఈ సందర్భంగా వీరిని ఉమ్మడి జిల్లా క్రికెట్‌ కార్యదర్శి కోదాటి ప్రదీప్‌, కోచ్‌ కోరండ్ల ప్రదీప్‌ తదితరులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement