విద్యార్థుల భవిష్యత్ మార్గదర్శకులు
విద్యారంగంలో జిల్లాది ప్రత్యేక స్థానం
అధిక అడ్మిషన్లతో రాష్ట్రంలో ప్రథమం
ప్రతిభా పురస్కారానికి కలెక్టర్ ఎంపిక
ఉత్తములుగా ఇద్దరు ఉపాధ్యాయులు
నేడు ఉపాధ్యాయ దినోత్సవం
మంచిర్యాలఅర్బన్: విద్యారంగంలో విశేష సేవలందించిన కలెక్టర్‌తోపాటు జిల్లాకు చెందిన మరో ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర స్థాయి పురస్కారాలు వరించాయి. కలెక్టర్ కుమార్ దీపక్‌ను విద్యాపరిపాలనలో ప్రతిభా పురస్కారం (అవార్డు ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ అడ్మినిస్ట్రేషన్)కు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. అలాగే, జ న్నారం మండలం కిష్టాపూర్ ప్రభు త్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండ రాజన్న రాష్ట్ర గె జిటెట్ ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగా, మందమర్రి సింగరేణి పాఠశాలలో బోధిస్తున్న నూ గూరి అనుపమ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యా రు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ శాతాన్ని అత్యధికంగా పెంచడానికి విశే ష కృషి చేసినందుకు కలెక్టర్‌కు ఈ అవార్డు వరించింది. ఈ నెల 5న నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో వీరంతా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు.
విద్యార్థుల నమోదుకు కలెక్టర్ కృషి
విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌లో జిల్లా రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. యూడైస్ 2026–27 గణాంకాల ప్రకారం జిల్లాకు కేటాయించిన లక్ష్యంలో అత్యధికంగా నమోదు పూర్తి చేసింది. జిల్లాలో 2026–27 విద్యాసంవత్సరానికి 47,379 మంది విద్యార్థుల నమోదు లక్ష్యానికి గాను 45,598 మందిని నమోదు చేసుకుని ముందువరుసలో నిలి చింది. ఇంకా 1,781 మందిని (3,76శాతం) మాత్రమే నమోదు చేయాల్సి ఉంది. 2025–26 విద్యావిద్యాసంవత్సరంతో పోలిస్తే అదనంగా 10శాతం నమోదును సాధించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించగా 96.33శాతం నమోదు సాధించి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
2025–26 విద్యాసంవత్సరంతో పోలిస్తే 2026–27లో 2,554 మంది అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు, బోధన, ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్ తదితర వసతులు కల్పించడంతో ఈ విద్యాసంవత్సరంలో 4,346 మంది ప్రైవేట్ పాఠశాలల నుంచి సర్కారు బడుల్లో చేరారు. జిల్లాలో 282 ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యాసంవత్సరంతో పోలిస్తే 10శాతానికి పైగా అదనపు విద్యార్థుల నమోదు సాధించారు. కలెక్టర్ కుమార్‌దీపక్‌కు విద్యాపరిపాలన విశిష్ట పురస్కారం లభించటం జిల్లా ప్రజలు, విద్యాశాఖకు విద్యారంగలో ఉన్న ప్రతీ ఒక్కరికి గర్వకారణమని జిల్లా విద్యాశాఖ పేర్కొంది. కలెక్టర్ దూరదృష్టి సమర్థవంతమైన నాయకత్వం, జిల్లా విద్యాశాఖాధికారి సమన్వయం, విద్యాశాఖ సెక్టోరల్ అధికారులు, మండల విద్యాధికారులు, కాంప్లెక్స్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఐఎస్ సీసీవో, సీఆర్పీల సమష్టి కృషికి నిదర్శనమని ఈ సందర్భంగా తెలిపింది.
ప్రభుత్వ పాఠశాలల్లో
విద్యార్థుల నమోదు ఇలా..
విద్యాసంవత్సరం విద్యార్థుల సంఖ్య
2024–25 41,349
2025–26 43,072
2026–27 45,626


