మంచిర్యాలక్రైం: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన 10వేల ఇళ్లను తొలగించేదాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో శుక్రవారం 22ఏ సమస్యపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 50ఏళ్ల క్రితం అన్ని అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్నారని తెలిపారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు సింగరేణిలో ఉన్నవారికి 6,220 ఇళ్లకు రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేయగా వాటిని కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఈ నెల 7నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో 22ఏపై ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ గళం విప్పుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం రెడ్డి కాలనీ, సింగరేణి, మార్కెట్ ఏరియా ప్రజలు 22ఏ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హరీశ్‌రావుకు తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల (ఆశ) సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, బాల్క సుమన్, చిన్నయ్య, బీఆర్‌ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, విజిత్‌రావు, పుష్కర్ రామ్మోహన్, కార్పొరేటర్లు సత్తార్, పెట్టం స్వరూప లక్ష్మణ్, నాయకులు గాదె సత్యం, పల్లె భూమేశ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కమీషన్ల పాలన
బెల్లంపల్లి: రాష్ట్రంలో కమీషన్ల పాలన సాగుతోందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి 13వ వార్డులో కాంగ్రెస్ వె య్యిరోజుల పాలనపై బీఆర్‌ఎస్ ఇచ్చిన పిలుపు మే రకు వంటావార్పు నిర్వహించగా హరీశ్‌రావు ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్‌రె డ్డి వెయ్యిరోజుల పాలన అస్తవ్యస్తంగా ఉందని వి మర్శించారు. కొత్తగా ఒక్కరికీ ఫింఛన్ మంజూరు చే యలేదని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ను వంచనకు గురిచేశారని ఆరోపించారు. మూడున్నర లక్షల మంది పింఛన్లు తొలగించారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలు, కుంభకోణాలు, సెటిల్‌మెంట్లు పెరిగిపోయాయని తెలిపారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఏవీ సరిగా అమలు కావడం లేదని పే ర్కొన్నారు. కమీషన్లు వచ్చే పనులు మినహా మరే ప నులు జరగడం లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ శ్రే ణులు ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరా టాలు సాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం రోడ్డుపై వంటావార్పు చేపట్టి సహఫంక్తి భోజనాలు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ స త్యనారాయణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


