జన్నారం: ఉపాధ్యాయుల సమష్టి కృషి, ఉత్తమ ఫలితాలు, అత్యధిక విద్యార్థుల చేరిక వీటి ఫలితంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయుని గా ఎంపికయ్యారు. పట్టుదల, సాధించాలనే తపన, ఉపాధ్యాయుల సమష్టి కృషి ఫలితంగా ఆ బడికి రాష్ట్రస్థాయిలో పేరు వచ్చింది. జన్నారం మండలం కిష్టాపూర్ ప్రభుత్వ ఉన్న త పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండ రాజన్న రాష్ట్ర గెజిటెట్ ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగా ఎంపికై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పురస్కారం అందుకోనున్నారు. కిష్టాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 2023లో ప్రధానోపాధ్యాయునిగా చేరిన రాజన్న విద్యార్థులను చదువులో ప్రోత్సహించడంతో మూడేళ్లుగా పదోతరగతి ఫలితాల్లో జిల్లా స్థాయిలో మొదటిస్థానం సాధించారు. జాతీయ ఉపకార వేతనాల సాధనలోనూ ఈ పా ఠశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ విద్యాసంవత్సరం అత్యధికగా 200మంది విద్యార్థులకు పాఠశాలలో ప్రవేశాలు కల్పించి రాష్ట్రస్థాయిలో గుర్తింపు సాధించింది. కి ష్టాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఫలితాల ఆధారంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రధానోధ్యాయునిగా రాజన్నను ఎంపిక చేశారు. ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని, విద్యాభివృద్ధికి మరింత కృషి చేస్తానని రాజన్న తెలిపారు.
ఆకట్టుకునేలా పాఠం.. అవార్డు సొంతం
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూ ల్‌లో సెకండ్ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న నూగూరి అనుపమ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. పాఠశాలలో పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం, విద్యార్థులను ఆకట్టుకునే బోధన తదితర అంశాల్లో అనుపమ ప్రత్యేక గుర్తింపు పొందారు. నేడు కొడంగల్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకోనున్నారు. సింగరేణి హైస్కూల్లో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు అనుపమ ఉత్తమ టీచర్‌గా ఎంపిక కావడంపై ఏరియా జీఎం రాధాకృష్ణ, డీసీఎం (పర్సనల్) అశోక్, హైస్కూల్ హెచ్‌ఎం పురుషోత్తం, పాఠశాల ఉపాధ్యాయయులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.


