అర్థమయ్యేలా బోధించి.. విద్యార్థుల సంఖ్య పెంచి.. | - | Sakshi
Sakshi News home page

అర్థమయ్యేలా బోధించి.. విద్యార్థుల సంఖ్య పెంచి..

Sep 5 2026 5:43 AM | Updated on Sep 5 2026 5:43 AM

భీమారం: మండలంలోని ఆర్కెపల్లి ప్రభుత్వ పాథమిక పాఠశాలకు సర్కారు గుర్తింపు వచ్చేందుకు ప్రధానోపాధ్యాయురాలు దరిపెల్లి స్పరూప చేస్తున్న కృషి అంతా.. ఇంతా కాదు. 2024లో ఈ పాఠశాలకు స్వరూప బదిలీపై రాగా అప్పుడు బడిలో నలుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం వారి సంఖ్య 57కి పెరిగిందంటే స్వరూప కృషే కారణం. ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా బోధిస్తుండగా తల్లిదండ్రులు పిల్లలను చేర్పించేందుకు ముందుకువస్తున్నారు. రొటీన్‌ పద్ధతిలో కాకుండా పిల్లలకు సులభంగా అర్థమయ్యే రీతిలో బోధిస్తూ కనీ స సామర్థ్యాలను పెంచేందుకు కృషి చేస్తున్నా రు. దాతల సహకారంతో పాఠశాలలో అవసరమైన సదుపాయాలు కల్పించారు. బాలల కథలు, ఆర్కెపల్లి అనే పుస్తకాన్ని ప్రచురించా రు. స్వరూప కృషిని గుర్తించి ప్రభుత్వం 2025లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేసింది. దీంతో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా స్వరూప పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా స్వరూప మాట్లాడు తూ.. విద్యార్థులను తన సొంత పిల్లల్లాగా భా వించి బోధిస్తున్నానని తెలిపారు. భవిష్యత్‌లో ఆర్కెపల్లి ప్రభుత్వ పాఠశాలను జిల్లాలోనే ఆద ర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.

స్పరూప ముద్రించిన

బాలల కథలు పుస్తకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement