కేసీఆర్‌ పాలనలో అంతా అవినీతే.. | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ పాలనలో అంతా అవినీతే..

Sep 5 2026 5:43 AM | Updated on Sep 5 2026 5:43 AM

● యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం ● మంత్రి వివేక్‌ వెంకటస్వామి

మంచిర్యాలక్రైం: పదేళ్ల కేసీఆర్‌ పాలనలో అంతా అవినీతేనని రాష్ట్ర భూగర్భ గనులశాఖ మంత్రి గ డ్డం వివేక్‌ వెంకటస్వామి ఆరోపించారు. జపాన్‌ ప ర్యటన ముగించుకుని శుక్రవారం జిల్లాకు వచ్చిన మంత్రికి కాంగ్రెస్‌ నాయకులు ఘనస్వాగతం పలి కారు. అనంతరం మంత్రి జిల్లా కేంద్రంలోని బైపాస్‌ రోడ్డులోగల మంతెన జగన్‌మోహన్‌రావు నివా సంలో విలేకరులతో మాట్లాడారు. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులు కృషి చేయాలని సూచించారు. రూ.20వేల కోట్ల తో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్‌ పూర్తి చేసే అవకాశమున్నా కాళేశ్వరం రీడిజైన్‌ పేరిట కేసీఆర్‌ రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతిని కేంద్రంలోని సీబీఐ ఎంకై ్వరీతో చేయించి చర్యలు తీసుకో వాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ చేసిన అప్పుల్లో రెండేళ్లలో రూ.3లక్షల కోట్లు చెల్లించినట్లు తెలిపా రు. కేటీఆర్‌ అసమర్ధతతోనే పార్లమెంట్‌, అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలైందని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే టామ్‌ కామ్‌ లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement