‘కొండా’ బర్తరఫ్‌ నిర్ణయం సరికాదు | - | Sakshi
Sakshi News home page

‘కొండా’ బర్తరఫ్‌ నిర్ణయం సరికాదు

Sep 5 2026 5:43 AM | Updated on Sep 5 2026 5:43 AM

పాతమంచిర్యాల: కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయడం సరికాదని, సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్‌, బీసీ సమాజ్‌ రాష్ట్ర కార్యదర్శి నరెడ్ల శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. సురేఖను బర్తరఫ్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సమితి నాయకులు శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. బీసీ మహిళా మంత్రికి ఒక న్యాయం, రెడ్డి నాయకులకు మరొక న్యా యమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే కొండా సురేఖ బర్తరఫ్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు మంచర్ల సదానందం, బీసీ సమా జ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్‌, బీసీ సమాజ్‌ పట్టణ నాయకుడు వెన్నంపల్లి మురళి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement