కాసిపేట: ఏఐటీయూసీ పోరాట ఫలితంగా సింగరేణి కార్మికులకు పలు కీలక ప్రయోజనాలు అందాయని ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షుడు, శాశ్వత వేజ్‌బోర్డు సభ్యుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. శుక్రవారం మందమర్రి ఏరియా కాసిపేట –2 గనిపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆర్‌ఎల్‌సీ సమక్షంలో 24 డిమాండ్లపై ఒప్పందం ఏఐటీయూసీ పోరాట ఫలితంగానే సాధించినట్లు తెలిపారు. అపరిష్కృత కార్మిక సమస్యలపై జూన్ 8న 31 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇవ్వడంతో యాజమాన్యం గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో పలు ఒ ప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. పలు ప్రధాన అంశాలపై కార్మికుల ఐక్య పోరాటాలతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ఏఐటీయూసీ గని ఫిట్ సెక్రెటరీ గొల్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మిట్టపల్లి వెంకటస్వామి, సెంట్రల్ సెక్రెటరీ అక్బర్‌ఆలీ, బెల్లంపల్లి బ్రాంచి సెక్రెటరీ దాగం మల్లేష్, బ్రాంచి అసిస్టెంట్ సెక్రెటరీ తిరుపతి, బ్రాంచి వైస్ ప్రెసిడెంట్ బియ్యాల వెంకటస్వామి, బ్రాంచి ఇన్‌చార్జి చిప్ప నర్సయ్య, నాయకులు మినుగు లక్ష్మీనారాయణ, నాగేశ్వర్‌రావు, మంతెన రమేశ్, నర్సయ్య, వెంకటే శ్, సాగర్, అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


