జనజాగరణ యాత్ర పోస్టర్ల ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

జనజాగరణ యాత్ర పోస్టర్ల ఆవిష్కరణ

Jul 24 2026 1:45 AM | Updated on Jul 24 2026 1:45 AM

మంచిర్యాలఅగ్రికల్చర్‌: సీపీఎస్‌ రద్దు చేయాలని తెలంగాణ స్టేట్‌ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన జనజాగరణ యాత్ర పోస్టర్లను ఆ సంఘం నాయకులు గురువారం కలెక్టరేట్‌ ఆవరణలో ఆవిష్కరించారు. టీఎస్‌పీఎస్‌ఈయూ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల రాజేందర్‌ మాట్లాడుతూ జనజాగరణ యాత్ర ఈ నెల 25న మంచిర్యాల జిల్లాకు చేరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌కుమార్‌, మంచిర్యాల ఏరియా అధ్యక్షులు గోపాల్‌, ప్రధాన కార్యదర్శి అజయ్‌ ప్రశాంత్‌, జిల్లా ఉపాధ్యక్షుడు రామ్‌కుమార్‌, తిరుపతి, రాజేందర్‌, మహిళా కార్యదర్శి సునీత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement