పాతమంచిర్యాల: బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థను బలోపేతం చేయాలని, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు గురువారం స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయిస్ యూనియన్, ఆల్ ఇండియా బీఎన్‌ఎన్‌ఎల్ డాట్ పెన్షనర్స్ అసోసియేషన్, బీఎస్‌ఎన్‌ఎల్ క్యాజువల్ కాంట్రాక్టు వర్కర్స్ ఫెడరేషన్, సెంట్రల్ హెడ్‌క్వార్టర్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ 4జీ, 5జీ సేవల విస్తరణకు అవసరమైన పెట్టుబడులు పెట్టి సంస్థను బలోపేతం చేసి వినియోగదారులకు నాణ్య మైన సేవలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బీఎస్‌ఎన్‌ఎల్ డాట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ట్రెజరీ వెంకటేశ్వర్లు, బ్రాంచ్ సెక్రెటరీ లింగయ్య, నాయకులు దిలీప్‌కుమార్, తౌపిక్ అహ్మద్, విద్యాసాగర్, సుచిత్ర, లక్ష్మీనారాయణ, లింగమూర్తి, జే.సత్యనారాయణ పాల్గొన్నారు.


