మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఆశించిన వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం లేక ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో నీటినిల్వ తగ్గిపోతోంది. గత ఏడాది ఇదే సమయానికి 10 టీఎంసీలు నీరు ఉండగా.. ప్రస్తుతం 7 టీఎంసీల నీరుంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 20.175 టీఎంసీలకు 7.954 టీఎంసీల నీటిమట్టంతో ఉంది. ఇన్‌ఫ్లో కింద 1,799 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 268, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీరు తరలిస్తున్నారు.
జిల్లాలో 8.3 మిల్లీమీటర్ల వర్షపాతం
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు 8.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జన్నారం మండలంలో 11.4 మిల్లీమీటర్లు, దండేపల్లిలో 7.3, లక్సెట్టిపేటలో 3.8, హాజీపూర్‌లో 7.9, కాసిపేటలో 10.1, తాండూర్‌లో 11.8, భీమినిలో 10.6, కన్నెపల్లిలో 9, వేమనపల్లిలో 5.8, నెన్నెలలో 7.6, నస్పూర్‌లో 13.2, జైపూర్‌లో 11.3, భీమారంలో 12.2, చెన్నూర్‌లో 4.7, కోటపల్లిలో 2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 394.6 మిల్లీమీటర్లు కాగా 314 మిల్లీమీటర్లు కురిసింది. జిల్లా సగటున 20శాతం లోటు నెలకొంది. తాండూర్ అధికం, దండేపల్లిలో అత్యధిక లోటు, 4 మండలాలు సాధారణం, 12 మండలాలు 20 నుంచి 35 శాతం లోటు నెలకొంది.


