సీఎంఆర్‌ త్వరగా పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ త్వరగా పూర్తిచేయాలి

Jul 24 2026 1:45 AM | Updated on Jul 24 2026 1:45 AM

దండేపల్లి/జన్నారం: వానాకాలం, యాసంగి 2025–26కు సంబంధించిన సీఎంఆర్‌ త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ వడాల రాములు రైస్‌మిల్‌ యజమానులకు సూచించారు. దండేపల్లి మండలం కన్నెపల్లి, పెద్దపేట, లింగాపూర్‌, జన్నారం మండలం మొర్రిగూడ గ్రామాల్లోని రైస్‌మిల్‌లను గురువారం ఆయన తనిఖీ చేశారు. మిల్లింగ్‌ తీరును పరిశీలించారు. దండేపల్లి, జన్నారం తహసీల్దార్‌ కార్యాలయాలను సందర్శించి సాదాబైనామా, భూభారతి దరఖాస్తులు, సర్‌ ప్రక్రియపై సమీక్షించారు. తహసీల్దార్లు రోహిత్‌దేశ్‌పాండే, బక్కయ్య, ఆర్‌ఐలు భూమన్న, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement