మంచిర్యాలఅర్బన్: జిల్లాలో యంగ్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కింద ఎంపికై న తాండూర్, మంచిర్యాల, బెల్లంపల్లి కేజీబీవీల్లో ప్రవేశాలకు ఈనెల 12న అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. తాండూర్, బెల్లంపల్లి, మంచిర్యాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 18 కే జీబీవీల్లో నూతనంగా అడ్మిషన్లు పొందిన 263 మంది ిబాలికలు పరీక్షకు హాజరుకానున్నారు. ఒక్కో కేజీబీవీలో 20 సీట్ల చొప్పున ఉన్నాయి. ఇందులో ప్రవేశాలు పొంది పదో తరగతి ఉత్తీ ర్ణులైన విద్యార్థినులకు ఇంటర్మీడియట్‌లో ఐఐ టీ, జేఈఈ మెయిన్స్, నీట్, క్లాట్ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. నిపుణులతో జాతీయ పోటీ పరీక్షలకు సన్నద్ధం చేస్తారు. ప్రవేశ పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలని సెక్టోరియల్ అధికారి విజయలక్ష్మి సూచించారు. శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సీఎస్, డీవోలకు పరీక్ష నిర్వహణపై అవగాహన కల్పించారు. జిల్లా పరీక్షల విభాగం సహాయ కమిషనర్ మల్లేశం, ఎస్వోలు పాల్గొన్నారు.


