మంచిర్యాలటౌన్: కుటుంబ నియంత్రణపై త ప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అరుణశ్రీ, డాక్టర్ సు ధాకర్ నాయక్ పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి అవగా హన ర్యాలీ ప్రారంభించారు. అన్ని పీహెచ్‌సీ ల పరిధిలో ఈ నెల 18వరకు జనాభా నియంత్రణపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆర్‌ఎంవో శ్రీధర్, జిల్లా మాస్ మీడియా అధి కారి వెంకటేశ్వర్, శ్రీనివాస్, ఎండీ రషీద్, సీహెచ్‌వోలు నాందేవ్, వెంకటేశ్వర్లు, సత్తయ్య, పద్మ పాల్గొన్నారు.


