మంచిర్యాలటౌన్: మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో కేరళ ఎక్స్‌ప్రెస్, ఏపీ, చైన్నె–భగత్‌కికోటి సూప ర్ ఫాస్ట్ రైళ్లను నిలుపాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి శనివారం హైదరాబాద్‌లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వినతిపత్రం అందించారు. మంచిర్యాల రైల్వేస్టేషన్ నుంచి నిత్యం వేలాది మంది రైళ్లలో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారని తెలిపారు. సూపర్‌ఫాస్ట్ రైళ్లను మంచిర్యాలలో నిలిపితే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. రైల్వేశాఖకు ఆదాయ మూ సమకూరుతుందని వివరించారు.


