సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లా కేంద్రానికి చెందిన ఓ కాలనీ ఓటరు వారం రోజుల కిందట ఎన్యూమరేషన్ ఫారం తీసుకున్నాడు. చివరకు వారం తర్వాత పాస్‌పోర్టు సైజు ఫొటో, వివరాలు పంపించి నమోదు చేయాలని బీఎల్వోను కోరాడు. ఇలా.. చాలా మంది చదువుకున్న విద్యావంతులే వివరాలు నమోదు, ఫారాలు బీఎల్వోలకు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారు. ఇక చదువు రానివారితోపా టు చదువుకున్నవారూ ఫారాలు పూరించలేకపోతున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో అధికా రులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు అందరూ అప్రమత్తంగానే ఉన్నారు. కానీ, చా లామంది ఓటర్లు మాత్రం ఎన్యూమరేషన్ ఫారాలు పూరించి ఇవ్వడంలోనే తీవ్ర జాప్యం చేస్తున్నారు. జిల్లాలో చాలాచోట్ల చదువుకున్న వారే వివరాలు నమోదు చేయడంలో తడబాటు పడుతున్నారు. ఈ నెల 24లోపు ప్రతీ ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాల్సి ఉండగా, ఇంకా జిల్లాలో 35శాతమే డిజిటలైజేషన్ చేశారు. దీంతో బీఎల్వోలకు అదనపు పని భారం పడుతోంది. ఓవైపు ఎలక్షన్ కమిషన్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తున్నాయి. తప్పనిసరిగా ప్రతీ ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలని కోరుతున్నా తీవ్ర జాప్యం చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణాలు, జిల్లా కేంద్రంలోని ఓటర్లు ఇతర చోట్ల విద్య, ఉద్యోగ, వ్యాపార రీత్యా వెళ్లిన వారి వివరాలు వారి కుటుంబీకులు నమోదు చేస్తున్నారు. లేటెస్ట్ పాస్‌పోర్టు సైజు ఫొటోలు లేక కూడా జాప్యం జరుగుతోంది. అధికారులు విస్త్రృతంగా అవగాహన కల్పిస్తున్నా, ఫారాలు స్వయంగా అందించేవారు చాలా తక్కువ మంది ఉంటున్నారు.
మరో 12 రోజులే..
ఓవైపు ఎన్యూమరేషన్ ఫారాలు నమోదు చేసి ఇవ్వడం ఓటరు బాధ్యత. ఎన్నికల సంఘం విధించిన గడువు ముంచుకొస్తోంది. ఒక్కసారిగా అందరూ వివరాలు ఇస్తే, చివరి వారంలో ఇబ్బంది పడే అవకాశముంది. జిల్లా ఉన్నతాధికారులకు బీఎల్వోలకు అదనంగా సిబ్బందిని సహాయం అందించేలా ఏర్పాట్లు చేశారు. గ్రామాల్లో పంచాయతీ సిబ్బందిని, మున్సిపల్, మహిళా సంఘాల గ్రూపుల్లో పని చేస్తున్నవారితో పాటు స్థానిక యువత, వలంటీర్లనూ ఎన్యూమరేషన్ ఫారాల నమోదులో భాగస్వాములను చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుత ఓటరు జాబి తా ప్రకారం 6.61లక్షల ఓటర్లున్నారు. వీరికి మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల పరి ధిలో 747మంది బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారా లు పంపిణీ చేస్తూ, వివరాలు పూరించిన తర్వాత తిరిగి తీసుకుంటున్నారు. చాలాచోట్ల ఓటర్ల వివరాలు రాజకీయ పార్టీల నాయకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లోనే అందిస్తున్నారు. జిల్లాలో 6,61,467 ఓట్లుండగా 99.55శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయింది. పూరించిన ఫారాల స్కానింగ్ 35 శాతం 35శాతమే అయ్యింది.


