మంచిర్యాలఅగ్రికల్చర్: విద్య, వృత్తి విద్య కోర్సులతో శిక్షణ అందించి ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మాధ్యమిక విద్యాశాఖ అధికారి అంజయ్యతో కలిసి జూనియర్, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్, అడ్వాన్ టెక్నాలజీ సెంటర్ల ప్రిన్సిపాల్‌లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని అన్నారు. జూనియర్, డిగ్రీ కళాశాలల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, విద్యార్థుల హాజరు శాతం పెంపొందించేలా కృషి చేయాలని తెలిపారు. ఏటీసీల ద్వారా ఉద్యోగం సాధించిన వారి వివరాలను ప్రచారం చేయడం ద్వారా అడ్మిషన్ల సంఖ్య పెంచాలని తెలిపారు.


