కవ్వాల్‌ల్‌ శిక్షణ ఐఏఎస్‌ల పర్యటన | - | Sakshi
Sakshi News home page

కవ్వాల్‌ల్‌ శిక్షణ ఐఏఎస్‌ల పర్యటన

Jun 10 2026 1:43 AM | Updated on Jun 10 2026 1:43 AM

జన్నారం: కవ్వాల్‌ టైగర్‌జోన్‌ జన్నారం అటవీ డివిజన్‌లో 2025 బ్యాచ్‌కు చెందిన శిక్షణ ఐఏఎస్‌ అధికారులు మంగళవారం పర్యటించారు. తెలంగాణ దర్శన్‌లో భాగంగా ట్రెయినీ ఐఏఎస్‌ అధికారులు సచిన్‌ బసవరాజు, ఇ.సాయిశివాని, సురేష్‌ పామూరి, పి.హరిప్రసాద్‌ బృందం కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌లోని పలు ప్రాంతాలను సందర్శించారు. అటవీ శాఖ సఫారీ వాహనాల్లో గొండుగూడ బేస్‌క్యాంపు, బైసన్‌కుంట, నీలుగాయి కుంట, మల్యాల వాచ్‌ టవర్‌ ప్రాంతాలు పరిశీలించారు. వన్యప్రాణులు, మల్యాల వాచ్‌ టవర్‌ ఎక్కి అడవుల అందాలను వీక్షించారు. బైసన్‌కుంట ప్రాంతంలో బర్డ్‌ వాక్‌ చేశారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని వివిధ రకాల చెట్లు, వన్యప్రాణులు, పక్షుల వివరాలు, ఎకో టూరిజం కింద చేపడుతున్న అభివృద్ధి పనులపై ఎఫ్‌డీవో రామ్మోహన్‌ వివరించారు. దండేపల్లి డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ పి.రాము, ఫారెస్ట్‌ సెక్షన్‌, బీట్‌ ఆఫీసర్లు బి.భోజనాయక్‌, శ్రీకాంత్‌, అజీజ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement