జిల్లా సాగు విస్తీర్ణానికి అనుగుణంగా విత్తన, ఎరువుల ప్ర ణాళిక సిద్ధం చేశాం. నైరుతి రుతుపవనాలు జిల్లాను తాకి వర్షాలు పడేలోగా రైతులు పొలాలు సిద్ధం చేసుకోవాలి. వేసిన పంట వేయకుండా మార్పిడి చేస్తుండాలి. ప్రభుత్వ గుర్తింపు లేని, నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దు. గుర్తింపు పొందిన డీలర్ నుంచి నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి వెంటనే రసీదు తీసుకోవాలి. పెద్ద మొత్తంలో సాగు చేసే రైతులు ఒకే రకమైన కంపెనీ విత్తనాలు కాకుండా రెండు మూడు రకాల కంపెనీల విత్తనాలు వేసుకోవాలి. దీని ద్వారా వర్షభావ పరిస్థితులను బట్టి దిగుబడులు ఉంటాయి. ఈయేడాది విత్తనాలు, ఎరువుల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం.
– సురేఖ, జిల్లా వ్యవసాయ అధికారి


