సాగుకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

సాగుకు సిద్ధం

Jun 10 2026 1:43 AM | Updated on Jun 10 2026 1:43 AM

● 3.57లక్షల ఎకరాలకు ప్రణాళిక ● విత్తనాలు, ఎరువులకు ప్రతిపాదనలు ● పత్తి, వరి పంటలే ప్రధానం

మంచిర్యాలఅగ్రిల్చర్‌: ఖరీఫ్‌ సాగు సీజన్‌ మొదలైంది. వ్యవసాయ శాఖ వానాకాలం పంటల సాగు ప్రణాళిక సిద్ధం చేసింది. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులపై అంచనాలు రూపొందించింది. గత ఏడాది ఖరీఫ్‌లో ఆలస్యంగా వర్షాలు కురువడంతో రైతులు ప్రారంభంలో ఇబ్బందులు పడ్డారు. ఆలస్యమైనా.. భారీ వర్షాలతో జలాశయాలు సాధారణ స్థాయికి చేరాయి. దీంతో ఆలస్యంగానైనా సాగు విస్తీర్ణం సాధారణ స్థాయికి చేరింది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. రైతులు పంటల సాగుకు సన్నద్ధమవుతూ పొలాల్లో చెత్తాచెదారం, గడ్డి తొలగిస్తున్నారు. జిల్లాలో గత రెండ్రోజులుగా వాతావరణం చల్లబ డింది. సాయంత్రం వేళ ఆకాశం మేఘావృతం అవుతూ అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తుండడంతో రైతులు దుక్కులు దున్ని చేన్లు చదును చేసి విత్తనాలు వేసేందుకు సిద్ధం చేసుకుంటున్నారు.

పెరుగనున్న విస్తీర్ణం..!

గత ఏడాది 3.32లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా.. ఈ ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేశారు. 3,57,253 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేస్తూ విత్తనాలు, ఎరువులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో పత్తి 1.76లక్షల ఎకరాలు, వరి 1.57లక్షల ఎకరాలు, 1,547 ఎకరాల్లో కందులు, 1,150 ఎకరాల్లో పెసలు, 978 ఎకరాల్లో మొక్కజొన్న, 20,560 ఎకరాల్లో ఇతర పంటలు సాగవుతాయని అంచనా వేశారు. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా రాయితీపై విత్తనాలు, ఎరువులు అవసరమవుతాయని ప్రణాళిక రూపొందించారు.

విత్తనాలు..

జిల్లాలో అధికంగా సాగయ్యే పత్తి విత్తన ప్యాకేట్లు 3,53,577, వరి విత్తనాలు 28,354 క్వింటాళ్లు, కందులు 66.7 క్వింటాళ్లు, మొక్కజొన్న 7,952 క్వింటాళ్లు, ఇతర విత్తనాలు 21,698 క్వింటాళ్లు అవసరమని అంచనా వేశారు. ఈ విత్తనాలపై ప్రభుత్వ రాయితీ లేకపోవడంతో డీలర్ల వద్దనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జీలుగ 3,350 క్వింటాళ్లు, జనుము 840 క్వింటాళ్లు, పిల్లిపెసర 165 క్వింటాళ్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించారు. సేంద్రియ ఎరువుగా వాడే జీలుగ, జనుము విత్తనాలు ప్రభుత్వం రాయితీపై అందిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు జిల్లాకు జీలుగ 2,997.1క్వింటాళ్లు, జనుము 580 క్వింటాళ్లు, పిల్లిపెసర 56 క్వింటాళ్ల విత్తనాలు చేరాయి. 548 క్వింటాళ్లు జీలుగ, 154 క్వింటాళ్ల జనుము, 9క్వింటాళ్ల పిల్లిపెసర విత్తనాలు రైతులకు అందజేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఏడాది రుణ లక్ష్యం..

గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.200 కోట్ల మేర రుణ లక్ష్యం పెరిగింది. గత ఏడాది రూ.1860.75 కోట్ల రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా బ్యాంకర్లు ఖరీఫ్‌, రబీ కలిపి రూ.1630.27 కోట్లు మాత్రమే రైతులకు అందించారు. ఈ ఏడాది రూ.1962.50 కోట్లు ఇవ్వాలని రుణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటా రుణ లక్ష్యం భారీగానే పెంచుతున్నా రైతులకు అందివ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఎదురవుతోంది. సమయానికి బ్యాంకర్లు రుణాలు, ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి రూ.6వేల చొప్పున అందిస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.

పెరుగనున్న విస్తీర్ణం..!

ఎరువులు..

గత ఏడాది 3.32లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా.. ఈ ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం పెరుగుతుందని అంచనా వేశారు. 3,57,253 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేస్తూ విత్తనాలు, ఎరువులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో పత్తి 1.76లక్షల ఎకరాలు, వరి 1.57లక్షల ఎకరాలు, 1,547 ఎకరాల్లో కందులు, 1,150 ఎకరాల్లో పెసలు, 978 ఎకరాల్లో మొక్కజొన్న, 20,560 ఎకరాల్లో ఇతర పంటలు సాగవుతాయని అంచనా వేశారు. సాగు విస్తీర్ణానికి అనుగుణంగా రాయితీపై విత్తనాలు, ఎరువులు అవసరమవుతాయని ప్రణాళిక రూపొందించారు.

పంటల సాగు అవసరాల మేరకు ఈ ఏడాది 89,010 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని గుర్తించారు. యూరియా 28,620 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 13,305, ఎంవోపీ 8,352, ఎస్‌ఎస్‌పీ 3,308, ఎన్పీకే 35,425 మెట్రిక్‌ టన్నులు అవసరమని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పటివరకు 9,160.61మెట్రిక్‌ టన్నుల యూరియా, 1006.90 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 174.28 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌, 370.35 టన్నుల ఎస్‌ఎస్‌పీ, 9,458.96 టన్నులు ఎన్పీకే అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement