ఓటర్ల సవరణ పకడ్బందీగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల సవరణ పకడ్బందీగా నిర్వహించాలి

Jun 10 2026 1:43 AM | Updated on Jun 10 2026 1:43 AM

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): జూన్‌ 25నుంచి చేపట్టనున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ వి.రాములు అన్నారు. మంగళవారం హాజీపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో కలెక్టరేట్‌ బీ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ మధుసూదన్‌, సిబ్బందితో కలిసి ఓటర్ల సమగ్ర సవరణ, సాదాబైనామా, భూభారతి పెండింగ్‌ దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై సమీక్షించారు. అదనపు కలెక్టర్‌ రాములు మాట్లాడుతూ బూత్‌ స్థాయి అధికారులు ప్రతీ ఇంటికి వెళ్లాలని, సూపర్‌వైజర్లు, ఏఈఆర్‌ఓలు పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. భూభారతి పోర్టల్‌లో పెండింగ్‌ దరఖాస్తులు పరిష్కరించాలని తెలిపారు.

ఓపీఎంఎస్‌ పూర్తి చేయాలి

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ధాన్యం కొనుగోలులో ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మేనేజ్‌మెంటు సిస్టం(ఓపీఎంఎస్‌) త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రాములు అన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్‌ శ్రీకళతో కలిసి ఎస్‌డబ్ల్యూసీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. గడువులోగా ధాన్యం ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement