రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ దుర్మరణం

Jun 10 2026 1:43 AM | Updated on Jun 10 2026 1:43 AM

నేరడిగొండ: రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ మృతి చెందగా ఆర్‌ఎంపీకి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లఖంపూర్‌ గ్రామానికి చెందిన మాడవి షేక్‌రావ్‌ (45) ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం తన ఆటోలో ఇచ్చోడ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాడవి షేక్‌రావ్‌కు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుమారి గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ దేవిదాస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు దేవిదాస్‌ను చికిత్స కోసం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. షేక్‌రావ్‌కు భార్య సంధ్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. ఇంటి పెద్దదిక్కు మరణించడంతో అతడి భార్య, పిల్లల రోదనలు స్థానికులను కలచివేశాయి. ఎస్సై ఇమ్రాన్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement