సందడే సందడి | - | Sakshi
Sakshi News home page

సందడే సందడి

Jun 10 2026 1:43 AM | Updated on Jun 10 2026 1:43 AM

ఉట్నూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రస్తుతం చిన్నారుల నవ్వులు, ఆటపాటలతో వారు చేసే సందడి కనిపిస్తోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్‌ పార్క్‌లో చిన్నారులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతున్నారు. పార్కులోని జారుడు బల్లలు, ఊయలలు, సీసాలపై ఊగుతూ చిందులు వేస్తున్నారు. ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ నవ్వులు చిందిస్తూ ఆటపాటల్లో మునిగితేలుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల వారు కూడా తమ పిల్లలను పార్క్‌కు తీసుకువస్తున్నారు. కాగా, చిన్నారులకు పోలీస్‌ సిబ్బంది స్టేషన్‌లో వారి విధుల గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఈ చిల్డ్రన్స్‌ పార్క్‌ వేసవిలో పిల్లలకు మంచి వినోదాన్నిస్తోంది. తమ పిల్లలు ఎలాంటి భయం లేకుండా సురక్షితమైన వాతావరణంలో ఆడుకోవడం చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. – ఉట్నూర్‌రూరల్‌

Advertisement
 
Advertisement
Advertisement