టీజీఎండీసీ పరిధిలో ఉన్న చెన్నూర్ 224, 225/1, 222/1 స్టాక్ యార్డుల నుంచి ఈ నెల 4న ఇసుక పంపిణీ అయింది. వే బిల్లులో ఇసుక రవాణా చేయాల్సిన ప్రాంతం నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్‌గా ఉంది. అక్కడి అడ్రస్‌తో ఎస్టీపీపీకి రావడంపై ఇసుకకు అక్కడికి అనుమతి తీసుకుని అక్రమ మార్గలో తరలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బిల్లుపై హిమ సాయి కన్‌స్ట్రక్షన్ పేరుతో ఉండగా, బిల్లుపైన మాత్రం పెన్నుతో కేపీసీ అని రాసి ఉంది. కేపీసీ సంస్థ ప్లాంటులో నిర్మాణ పనుల కాంట్రాక్టు దక్కించుకుంది. ఈ క్రమంలో ఇసుక రవాణాలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటి వెనుకాల ఎవరున్నారనేది కేసు విచారణలో తేలనుంది.


