దండేపల్లి/లక్సెట్టిపేట: వచ్చే ఏడాది జిల్లాలో జరిగే గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా మంచిర్యాల డీసీపీ భాస్కర్ గురువారం దండేపల్లి మండలం గూడెం, లక్సెట్టిపేట పట్టణంలోని గోదావరితీరాన్ని సందర్శించా రు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రస్తుతం గూడెం పుష్కరఘాట్లు ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌లో మునిగి ఉన్నందున కొత్త ఘాట్ల నిర్మాణానికి దేవాదాయ శాఖ ప్రతిపాదనలు తయారు చేసినట్లు అధికారులు తెలిపారు. ద్వారక, గుడిరేవు తీర ప్రాంతాల్లోనూ పుష్కర ఏర్పాట్లను పరిశీలించనున్నట్లు తెలిపారు. మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, దండేపల్లి తహసీల్దార్ రోహిత్‌దేశ్‌పాండే, లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సై సురేష్ పాల్గొన్నారు.


