మంచిర్యాలరూరల్(హాజీపూర్): గుడిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో గురువారం హాజీపూర్ సైబర్ క్రైమ్, షీ టీంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. హాజీపూర్ ఎస్సై కిరణ్‌కుమార్ మాట్లాడుతూ సైబర్ నేరాలపై అవగాహనతో ఉండాలని, అపరిచిత లింక్‌లను తెరవొద్దని, మొబైల్ ఫోన్ల వినియోగంలో అతి జాగ్రత్తగా ఉండాలని అన్నారు. విద్యార్థినులు, మహిళలకు ఎలాంటి ఆపద తలెత్తినా వెంటనే 112కు ఫోన్ చేస్తే అన్ని విధాలుగా సహాయం అంది ఆపద నుంచి రక్షణ పొందుతారని సూచించారు. కళాశాల అదనపు ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ డాక్టర్ రేఖ, ఏఎస్సై చాంద్‌పాషా, మహిళా కానిస్టేబుల్ అమ్రీన్‌బేగం, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.


