బాధ్యతగా విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

Feb 28 2026 7:18 AM | Updated on Feb 28 2026 7:18 AM

బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

బాధ్యతగా విధులు నిర్వర్తించాలి

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ● ముగిసిన సర్పంచ్‌ల శిక్షణ

మంచిర్యాలరూరల్‌(హజీపూర్‌): ప్రజల సంక్షేమం కోసం సర్పంచ్‌లు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి గ్రామాలను ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పిలుపునిచ్చారు. ముల్కల్లలో ని ఐజా ఇంజనీరింగ్‌ కళాశాలలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న మూడో విడత సర్పంచ్‌ల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విధులు, అధికారాలు, పాలనపై అవగాహన పొందిన సర్పంచ్‌లు ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు పర్యవేక్షణలో శిక్షణ తరగతులు కొనసాగాయి. జిల్లాలోని జన్నారం మండలం నుంచి 29మంది, నెన్నెల నుంచి 19మంది, బెల్లంపల్లి నుంచి 17మంది, కన్నెపల్లి నుంచి 15 మంది, తాండూరు నుంచి 15 మంది.. మొత్తంగా 95 మంది సర్పంచ్‌లు పాల్గొన్నారు. మాస్టర్‌ ట్రైనర్లు డీఎల్‌పీఓ కొమ్మెర సతీశ్‌, మోహన్‌, వెంకటేశ్‌, మహేశ్‌, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు శిక్షణ ఇచ్చారు. అనంతరం డీపీఓ వెంకటేశ్వర్‌రావు, శిక్షకుల చేతుల మీదుగా సర్పంచులకు శిక్షణ సర్టిఫికెట్లు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement