కాంగ్రెస్ ఓటమికి కారకులైన శ్రేణులపై చర్యలు
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కారణమైన శ్రేణులపై అధి ష్టానం చర్యలు తీసుకుంటుందని బెల్లంపల్లి ఎమ్మె ల్యే గడ్డం వినోద్ అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను, పట్టణ కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను వేర్వేరుగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కొందరు గుట్టుగా ప్రయత్నాలు చేశారని, తప్పుడు ప్రచారం వల్ల ఓడిపోవాల్సి వచ్చిందని తెలిపారు. వ్యతిరేకంగా పని చేసినవారి వివరాలు అధిష్టానం సేకరించిందని అన్నారు. కౌన్సిలర్లు వార్డుల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. అంతకుముందు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ జే.సంపత్, అధికారులు పాలవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ పార్టీ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య, సీనియర్ నాయకులు సూరం రవీందర్‌రెడ్డి, చిలుముల శంకర్, నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.


