అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో వివిధ అభివృద్ధి పనులపై శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ డీఎంఎఫ్‌టీ కింద చేపట్టిన మూత్రశాలలు, ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన గ్రామ పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రం భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. పనులు పూర్తయిన వాటికి బిల్లులు సమర్పించాలని, ప్రధానమంత్రి జన్ మన్ కింద చేపట్టిన ఐదు అంగన్వాడీ కేంద భవనాలు నిర్మాణం పూర్తి చేసి బిల్లులు సమర్పించాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ ఇంజనీరింగ్ అధికారి జాదవ్ ప్రకాష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, విద్యాశాఖ అధికారి యాదయ్య, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈఈలు, డీఈఈ, ఏఈఈలు పాల్గొన్నారు.


