యంగ్‌ సైంటిస్ట్‌లకు ఇస్రో ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

యంగ్‌ సైంటిస్ట్‌లకు ఇస్రో ఆహ్వానం

Feb 28 2026 7:11 AM | Updated on Feb 28 2026 7:11 AM

యంగ్‌

యంగ్‌ సైంటిస్ట్‌లకు ఇస్రో ఆహ్వానం

● జనవరి 1 2026 నాటికి 9వ తరగతి చదువుతు న్న విద్యార్థులు దీనికి అర్హులు. ● ఎనిమిదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా 50శాతం, ఎనిమిదో తరగతి సైన్స్‌, సోషల్‌ సబ్జెక్టు మార్కుల ఆధారంగా 10శాతం, ఆన్‌లైన్‌ క్విజ్‌లో విద్యార్థి ప్రతిభకు 10 శాతం, సైన్స్‌ ఫెయిర్‌లో పాల్గొంటే 10శాతం, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులకు 05, గ్రామీణ ప్రాంత వి ద్యార్థులకు 15శాతం వెయిటేజీ మార్కులు కేటా యించి అర్హులైన విద్యార్థులను ఎంపిక చేస్తారు.

9వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం మార్చి 31 వరకు గడువు సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన

లక్ష్మణచాంద: పాఠశాలల విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టి వారిని భావిభారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే గొప్ప సంకల్పంతో ఇస్రో విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది. అంతరిక్ష సాంకేతిక అనువర్తనాలపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందించడ మే లక్ష్యంగా యంగ్‌ సైంటిస్ట్‌ పేరుతో యువ విజ్ఞా న్‌ కార్యక్రమాన్ని (యువికా) భారత అంతరిక్ష పరి శోధనా సంస్థ నిర్వహిస్తోంది.

9వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం..

9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 9వ తరగతి అభ్యసిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని నిర్మల్‌ జిల్లా సైన్స్‌ అధికారి వినోద్‌ కుమార్‌ తెలిపారు.

ఎంపిక ఇలా...

నిర్మల్‌ జిల్లా వ్యాప్తంగా 10,556 మంది విద్యార్థులు 9వ తరగతి అభ్యసిస్తున్నారు. ఈ విద్యార్థులందరు తమ తమ పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

ఎంపికై న విద్యార్థులకు...

ఇందులో విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరు ఎప్పటికై నా అంతరిక్ష కేంద్రానికి వెళ్లే అవకాశం కల్పిస్తారు. ఇస్రోకు చెందిన అహ్మదాబాద్‌, శ్రీహరికోట, హైదరాబాద్‌, బెంగళూరు, షిల్లాంగ్‌, తిరువనంతపురం వంటి కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఎంపికై న విద్యార్థులకు అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చా వేదికలు, ప్రయోగశాల సందర్శన, అంతరిక్ష శాస్త్రం, రాకెట్‌ ప్రయోగాలకు సంబంధించిన అంశాలపై ప్రాథమికంగా అవగాహన కల్పించనున్నారు.

సమాచారం..

దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 27

చివరి తేదీ: మార్చి 31

అర్హులు: 9వ తరగతి విద్యార్థులు

దరఖాస్తు చేసుకునే వెబ్‌సైట్‌:

www.isro.gov.in

ఇస్రో వద్ద రిపోర్టు చేయవలసిన చివరితేదీ:

మే 10

యువికా కార్యక్రమం: మే 11 నుంచి 22 మధ్య

యంగ్‌ సైంటిస్ట్‌లకు ఇస్రో ఆహ్వానం1
1/1

యంగ్‌ సైంటిస్ట్‌లకు ఇస్రో ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement