బహ్రెయిన్‌లో పార్‌పెల్లి వాసి మృతి
లక్ష్మణచాంద: ఉపాధికోసం బహ్రెయిన్ వెళ్లిన పార్‌పెల్లి వాసి గుండెపోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని పార్‌పెల్లి గ్రామానికి చెందిన కందుకూరి చిన్న రాజేశ్వర్(54) గత మూడు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం బహ్రెయిన్ వెళ్లాడు. శుక్రవారం ఎప్పటిలాగే కంపెనీలో పనిచేసే క్రమంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తనతో పాటు కుమారుడు రంజిత్ కూడా అక్కడే పని చేస్తుండటంతో ఆయన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. కుటుంబ పెద్ద దేశం కాని దేశంలో ప్రాణాలు విడవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.


