
ఎస్బీఐ ఎదుట ఖాతాదారుల ఆందోళన
చెన్నూర్: తమ బంగారం తమకు ఇవ్వాలని, లేదంటే పురుగుల మందు తాగి బ్యాంక్ ఎదు ట ఆత్మహత్య చేసుకుంటామని గోల్డ్‌లోన్ బా ధితులు చెన్నూర్ ఎస్బీఐ ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. బాధితులు మాట్లాడుతూ బ్యాంకు క్యాషియర్ నరిగే రవీందర్ బంగారం కుంభకోణానికి పాల్పడినా ఉన్నతాధికారులు స్పందించకపోవడం దారుణమ ని అన్నారు. ఎంతమంది బంగారం పోయిందో నోటీసు బోర్డుపై ఉంచాలని, బాధితులకు ఏవిధంగా, ఎన్ని రోజుల్లో న్యాయం చేస్తారో స్పష్టమైన హామీ ఇవ్వాలని పేర్కొన్నారు. బాధితుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చే యాలని తెలిపారు. వారం రోజుల్లో డిమాండ్లను నివృత్తి చేయకుంటే బ్యాంక్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రితేశ్‌కుమార్ గుప్తా, రీజినల్ మేనేజర్ ఆపరేషన్స్ విజయ్‌బాస్కర్, సీఐ దేవేందర్‌రావు బాధితులతో మాట్లాడారు. బాధితులు సహకరిస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బాధితులు, మల్లేశ్, తిరుపతి, రవీందర్‌రెడ్డి, సరేశ్ పాల్గొన్నారు.
బాధితుల ‘గ్రూపు’ పోరాటం
బాధితులు ‘ఎస్బీఐ గోల్డ్ విక్టిమ్స్’ అనే వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి వినూత్న పోరాటం చేస్తున్నారు. కుంభకోణానికి పాల్ప డిన నిందితులను పట్టుకోవాలని, న్యాయం చేయాలని, భవిష్యత్ కార్యాచరణ పొందు పరుస్తున్నారు. 402 మంది గోల్డ్ లోన్ బాధితులు ఉండగా 93 మంది గ్రూప్‌లో చేరారు.