సిబిల్ స్కోర్ పరిశీలన పూర్తి చేయాలి
మంచిర్యాలటౌన్: రాజీవ్ యువ వికాసం పథ కం దరఖాస్తుదారుల సిబిల్ స్కోర్ పరిశీలన ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని షెడ్యూల్డ్ కు లాల సహకార సంస్థ ఈడీ చాతరాజుల దుర్గాప్రసాద్ అన్నారు. బుధవారం స్థానిక మున్సి పల్ కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్, హాజీపూర్ మండల బ్యాంక్ మేనేజర్లు, మండ ల పరిషత్ అభివృద్ధి అధికారులు, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల అధికారులు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతితో సమావే శం అ య్యారు. ఈడీ మాట్లాడుతూ అభ్యర్థుల సిబిల్ స్కోర్ పరిశీలన రెండు రోజుల్లో పూర్తి చేసి ఈ నెల 17లోపు వివరాలు అందించాలని తెలిపా రు. జిల్లావ్యాప్తంగా 40,270 దరఖాస్తులు సిబి ల్ పరిశీలన కోసం పంపించినట్లు తెలిపారు.


