
బార్‌కు లక్కీ డ్రా
మంచిర్యాలక్రైం: మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేయనున్న బార్‌కు మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. హాజీపూర్ మండలం నమ్నూర్‌కు చెందిన నడిపెల్లి ధనుంజయ్‌రావు లక్కీడ్రాలో గెలుపొందినట్లు జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి నందగోపాల్ తెలిపారు. 15దరఖాస్తులు రాగా లక్కీ డ్రా ద్వారా విజేతను ఎంపిక చేశారు. ధనుంజయ్‌రావుకు ఎంపిక పత్రాన్ని అందజేశారు. సీఐ గురువయ్య, ఎస్సైలు పాల్గొన్నారు.
బెల్లంపల్లిలో దరఖాస్తు గడువు పొడిగింపు
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో బార్ ఏర్పాటుకు ఒకటే దరఖాస్తు రావడంతో మే 5వరకు గడువు పొడిగించినట్లు బెల్లంపల్లి ప్రొహిబిషన్, ఎకై ్సజ్ సీఐ జే.ఇంద్రప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాల కోసం 8712658785 నంబరులో, బెల్లంపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. మే 6న ఉదయం 11గంటలకు కలెక్టరేట్‌లో లక్కీడ్రా తీస్తామని ప్రకటించారు.