
పోడు రైతులకు అండగా ఉంటాం
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ ● అటవీశాఖ కార్యాలయంలో వినతిపత్రం
చెన్నూర్: పోడు భూములు సాగు చేసుకుని జీ వనం సాగిస్తున్న రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని, పోడు రైతులకు అండగా ఉంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ అన్నారు. పోడు రైతులను ఇబ్బందులకు గురి చేయడాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం చెన్నూర్ ఎఫ్‌డీవో కార్యాలయంలో అధి కారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటపల్లి మండలం పిన్నారం, ఎసాన్‌వాయి, బొప్పారం, ఎడగట్ట గ్రామాల్లో పోడు రైతులను కొందరు అధి కారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరో పించారు. రైతుల ఎద్దులు, నాగళ్లను తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో ఫా రెస్ట్ అధికారులు నాలుగు గ్రామాల్లో కందకాలు ఏ ర్పాటు చేశారని, వాటి అవతల వ్యవసాయం చేసుకుంటున్న రైతులను చిత్రహింసలకు గురిచేయడం బాధాకరమని అన్నారు. కోటపల్లి అటవీ అధికా రుల తీరుపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపా రు. ఈ కార్యక్రమంలో కోటపల్లి మండల బీ జేపీ అధ్యక్షుడు మంత్రి రామయ్య, సీనియర్ నాయకులు పెద్దపల్లి పురుషోత్తం, మాజీ కౌన్సి లర్ కమ్మల శ్రీనివాస్, వంశీగౌడ్ పాల్గొన్నారు.