గుడుంబా స్థావరాలపై దాడులు
ఖానాపూర్/కడెం: ఖానాపూర్ మండలంలో ని సత్తన్‌పల్లి, రాంరెడ్డిపల్లె గ్రామాల్లో శనివా రం ఎకై ్సజ్, ఆదిలాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 5 లీటర్ల గుడుంబా స్వాధీనం, 400 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. రాంరెడ్డిపల్లెకు చెందిన బి.అరవింద్‌పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. కడెం మండలంలోని పెద్దూర్‌తండా, చిన్నబెల్లాల్, పెద్దబెల్లాల్ గ్రామాల్లోని గుడుంబా స్థావరాలపై దాడి చేసి నాటుసారా, బెల్లం పట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ సీఐ రంగస్వామి, ఆదిలా బాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐలు గంగారెడ్డి, అక్బర్‌హుస్సేన్, ఎస్సై అభిషేకర్, డీటీఎఫ్ ఎస్సై సింధు, సిబ్బంది ఉన్నారు.


