ఆటో దగ్ధం
భైంసాటౌన్: పట్టణంలోని నర్సింహానగర్‌లో వేదం హైస్కూల్ సమీపంలో నిలిపి ఉంచిన ఓ ప్యాసింజర్ ఆటో శనివారం దగ్ధమైంది. మ ధ్యాహ్న సమయంలో ఆటోలో నుంచి ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు అ గ్నిమాపక శాఖ అధికారులకు సమాచారమి చ్చారు. దీంతో వారు చేరుకుని మంటలార్పివేశారు. పట్టణానికి చెందిన అల్తాఫ్ ప్రైవేట్ స్కూల్ బస్సు నడుపుతుండగా, ఖాళీ సమయంలో ఆటో నడిపేవాడు. సీఎన్‌జీ ఆటో కా వడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై పట్టణ సీఐ సాయికుమార్‌ను వివరణ కోరగా, ఎలాంటి ఫిర్యాదు రాలేదని పేర్కొన్నారు.


