‘గిరి’ యాదిలో హైమన్‌ డార్ఫ్‌ | - | Sakshi
Sakshi News home page

‘గిరి’ యాదిలో హైమన్‌ డార్ఫ్‌

Jan 11 2026 9:39 AM | Updated on Jan 11 2026 9:39 AM

‘గిరి

‘గిరి’ యాదిలో హైమన్‌ డార్ఫ్‌

● లండన్‌ నుంచి వచ్చి నాడు గిరిజనులతో కలిసి జీవించిన దంపతులు ● నేడు మార్లవాయిలో వర్ధంతి

ద చెంచుస్‌(1943)

ద రెడ్డీస్‌ ఆఫ్‌ బైసన్‌ హిల్స్‌ 1945

ద రాజ్‌గోండ్‌ ఆఫ్‌ ఆదిలాబాద్‌ 1945

ద షెర్పాస్‌ ఆఫ్‌ నేపాల్‌ 1964

ద కొన్యాక్‌ నాగస్‌ 1969

ద ట్రైబ్‌ ఆఫ్‌ ఇండియా: స్ట్రగుల్‌ ఫర్‌ సర్వేవర్‌ 1982

ఆసిఫాబాద్‌: ఎక్కడో లండన్‌ నుంచి తరలివచ్చిన ఆ దంపతులు తమ సేవలతో ఆదివాసీల హృద యాల్లో చిరస్థాయిగా నిలిచారు. వారే హైమన్‌ డార్ఫ్‌–బెట్టి ఎలిజెబెత్‌ దంపతులు. ఆంత్రోపాలజీ ప్రొఫెసర్‌ క్రిస్టోఫర్‌ వోన్‌ ఫ్యూరర్‌ హైమన్‌ డార్ఫ్‌, ఆయన భార్య బెట్టి ఎలిజెబెత్‌ 1970లో కుమురం భీం జిల్లా మార్లవాయిలో ఆదివాసీలతో ఉంటూ వారి ఆచారాలు, సమస్యలపై పరిశోధన చేశారు. గిరిజన జీవనస్థితి, సమస్యలు, వారి హక్కుల కోసం పోరాడారు. భౌతికంగా దూరమైన వారు చేసిన సేవలకు గుర్తుగా ఆదివాసీలు ఏటా జనవరి 11న ఆ దంపతుల వర్ధంతిని ఏజెన్సీలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం జైనూర్‌ మండలం మార్లవాయిలో జరిగే వర్ధంతికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.

ఆదివాసీలపై అధ్యయనం

ఆస్ట్రియా రాజధాని వియత్నాంలో 1909లో జన్మించిన హైమన్‌ డార్ఫ్‌ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో విద్యనభ్యసించారు. ఆంత్రోపాలజీలో డాక్టరేట్‌ చేశారు. భారత్‌లోని నాగా, గోండు, కోయ, కొండరెడ్లు, చెంచు, తదితర ఆదివాసీల జీవన విధానంపై అధ్యయనం చేశారు. 1942 నుంచి 1945 మధ్య ఆదిలాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలం మార్లవాయిలో తన సతీమణితో కలిసి నివసించారు. ఆదివాసీ లు, వారి ఆహారపు అలవాట్లు, జీవన విధానం, వ్య వసాయం, భాష, చావు, పుట్టుక, వివాహాలు, యా స, సాగు విధానాలపై డార్ఫ్‌ రాసిన పుస్తకాలు ప్రపంచంలో ఎంతో ప్రాముఖ్యత పొందాయి. 1979లో తొలిసారి భారత్‌కు వచ్చినప్పుడు లండన్‌ కు చెందిన మైఖేల్‌ యార్క్‌తో ఆదివాసీల జీవనంపై పలు డాక్యుమెంటరీలు చేశారు.

ఆదివాసీలకు భూ పట్టాలు పంపిణీ..

ఆదివాసీలు భూమిపై హక్కులు లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వారికి యాజమాన్య హక్కులు కల్పించేందుకు హైమన్‌ డార్ఫ్‌ నిజాం నవాబుతో చ ర్చలు జరిపారు. అప్పటికి అటవీ భూములను సాగు చేస్తున్న స్థానికులకు ఒక్కొక్కరికి సుమారు 15 ఎకరాలు ఇప్పించేందుకు కృషి చేశారు. నేడు ఏ జెన్సీలో 1.60 లక్షల ఎకరాలు ఆది వాసీ కుటుంబా లకు భూ పట్టాలు దక్కాయి. ఈక్రమంలో నిజాం ప్రభుత్వం డార్ఫ్‌ను కొంతకాలం పాటు గిరిజన అ భివృద్ధి సలహాదారుగా నియమించింది. ఆదివాసీ ల హక్కుల పరిరక్షణకు డార్ఫ్‌ సూచనలు, సలహా లు ఇచ్చారు. ఆయన నివసించిన మార్లవాయిలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పారు.

డార్ఫ్‌ దంపతులు నివసించిన ఇల్లు నమూనా

హైమన్‌ డార్ఫ్‌ దంపతుల విగ్రహాలు

డార్ఫ్‌ రచనలు

డార్ఫ్‌ కొడుకు పేరు లచ్చు పటేల్‌

హైమన్‌ డార్ఫ్‌ దంపతులు మార్లవాయిలో నివసం ఉన్నప్పుడు ఆ గ్రామపెద్ద లచ్చుపటేల్‌ మృతి చెందాడు. ఆ మరునాడే డార్ఫ్‌ భార్య ఎలిజెబెత్‌ ఓ కుమారుడికి జన్మనిచ్చింది. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం గ్రామంలో ఎవరైన చనిపోతే, మరుసటి రోజు ఎవరైనా పుడితే వారే మళ్లీ పుట్టారని నమ్ముతారు. ఈ క్రమంలో డార్ఫ్‌ దంపతులు తమ కొడుకు పేరు లచ్చుపటేల్‌ నామకరణం చేశారు. తమ మరణానంతరం తమ దంపతుల సమాధులు ఇక్కడే ఏర్పాటు చేయాలని డార్ఫ్‌ స్థానికులను కోరారు. ఎలిజెబెత్‌ 1987లో మరణించగా, కుమారుడు లచ్చుపటేల్‌(నికోలస్‌) ఆమె చితాభస్మాన్ని మార్లవాయికి తీసుకువచ్చి స మాధి కట్టించారు. 1995 జనవరి 11న హైమ న్‌ డార్ఫ్‌ మృతి చెందగా 2012లో చితాభస్మాన్ని భార్య సమాధి పక్కన డార్ఫ్‌ సమాధి కట్టించారు. అప్పటి నుంచి ఏటా జనవరి 11న డార్ఫ్‌ వర్ధంతిని ఆదివాసీలు జరుపుకొంటున్నారు. ఆదివారం రాష్ట్ర మంత్రులుతో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరుకానున్నారు.

‘గిరి’ యాదిలో హైమన్‌ డార్ఫ్‌1
1/1

‘గిరి’ యాదిలో హైమన్‌ డార్ఫ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement