6వ ట్రైబల్ స్టేట్ స్పోర్ట్స్ మీట్‌లో ప్రతిభ
బజార్‌హత్నూర్: ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన 6వ ట్రైబల్ స్టేట్‌మీట్ అథ్లెటిక్స్ క్రీడాపోటీల్లో మండలం జాతర్ల గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. అండర్–17 అథ్లెటిక్స్ క్రీ డాపోటీల్లో మహేశ్ గోల్డ్‌మెడల్(800 మీటర్ల), ఇంద్రబాన్ 100 మీటర్లు, షార్ట్‌ఫూట్, జా వెలిన్‌త్రోలో మూడు గోల్డ్ మెడల్స్, కార్తీక్ లాంగ్‌జంప్‌లో గోల్డ్‌మెడల్, నగేశ్, ఇంద్రబాన్, జకేష్, మహేశ్ (400 మీటర్ల) గోల్డ్‌మెడల్ సాధించారు. పాఠశాల క్రీడాకారులు 10 గోల్డ్,7 సిల్వర్,6 బ్రోంజ్ మెడల్స్ సా ధించినట్లు ప్రిన్సిపాల్ కిషన్‌రెడ్డి తెలిపారు. పార్డి గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం చందన్, కృష్ణారావు, ఉపాధ్యాయులు వారిని అభినందించారు.


